నంద్యాల అర్బన్: మహానంది సమీపంలో అదుపుతప్పిన బైక్, ఐదు మందికి గాయాలు
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహానంది నుంచి తిమ్మాపురం వెళ్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సూచిక స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తిమ్మాపురానికి చెందిన గౌతమ్, ప్రభాస్ అనే యువకులతో పాటు మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు