బనగానపల్లె: యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం :బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.