నిజామాబాద్ సౌత్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో దళాలను అరికట్టాలి: AIUKS రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్
జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో దళారులను అరికట్టాలని AIUKS రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షానికి మొక్కజొన్న, వరి తడిసి, రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. వెంటనే పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.