రామారెడ్డి: గిద్ద ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబురాలు, విద్యార్థులకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి : కన్నయ్య
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నయ్య అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రామారెడ్డి మండలంలో శనివారం మూడు గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గిద్ద లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను ఒకచోట పేర్చి పాఠశాలలో విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటలు ఆడారు బతుకమ్మ ఆటలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలన్నారు.