చేవెళ్ల నియోజకవర్గం నవాబ్‌పేట్ మండలం వట్టి మినపల్లికి చెందిన మోముల వెంకట్ రెడ్డి ఆర్మీలో 8 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తూ, ఈ రోజు ఢిల్లీలో అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జవాను మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.