కావలి: గంధ మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన కావలి MLA కావ్య కృష్ణారెడ్డి..
కావలిలోని జెండా చెట్టు వద్ద శ్రీశ్రీశ్రీ నాగూరు మీరా స్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముసునూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించారు. నవంబర్ 30వ తేదీన జరిగే గంధ మహోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఎమ్మెల్యేని ముస్లిం సోదరులు ఆహ్వానించారు. ఈ గంధం మహోత్సవ వేడుకలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.