ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఘనంగా ముగిసిన మొహర్రం వేడుకలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా ముగిశాయి, వారం రోజులుగా పీర్ల చావడిలో పీర్లను ప్రతిష్టించి ప్రతినిత్యం పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, చివరి రోజు శుక్రవారం సాయంత్రం పీర్ల చావడి నుంచి పాత బస్టాండ్ మీదుగా వకుళా నది వరకు వైభవంగా ఊరేగింపు చేపట్టారు, ఈ ఊరేగింపులో యువత రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు, పట్టణ సిఐ నాగరాజారావు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు