బనగానపల్లె: సంజామల మండలంలో కారు బోల్తా నలుగురికి గాయాలు
నంద్యాల జిల్లా సంజామల మండలంలోని పేరుసోముల, రెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న మలుపు వద్ద ఘోర ప్రమాదం తప్పింది. నరసింహారెడ్డి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి అహోబిలం పుణ్య క్షేత్రానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు