బనగానపల్లె: కొలిమిగుండ్లలో చెత్తను రోడ్లమీద వేస్తే కఠిన చర్యలు: పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్
ఇంట్లో చెత్తను ఇష్టానుసారంగా వీధుల్లో పడేస్తే కఠిన చర్యలు చేపడతామని కొలిమిగుండ్ల పంచాయతీ కార్య దర్శి ఉదయ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని దర్గా వీధిలో డ్రైనేజీ కాలువలకు మరమ్మతులు చేపట్టారు. వీధుల్లో చెత్తను తొలగించి పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలు అధికారులతో కలిసి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.