గుంతకల్లు: పట్టణంలోని హనుమాన్ సర్కిల్ లో ఓ వైన్ షాపులో బెల్డారి పెద్దన్న మృతి, వైరల్ అవుతున్న సీసీ టీవీ ఫుటేజ్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్ద ఉన్న ఓ వైన్ షాపు వెనకాల మద్యం తాగుతూ కుప్పకూలి బెల్డారి పెద్దన్న మృతి చెందిన సీసీ టీవీ కెమరా దృశ్యాలు మంగళవారం నుంచి వైరల్ గా మారాయి. ఈ నెల 5న పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి వెనకాల బండల పై కూర్చొని మద్యం సేవిస్తూ 15 నిమిషాల్లోనే విపరీతమైన మైకంలో పెద్దన్న కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పెద్దన్న కుప్పకూలడం పక్కన ఉన్న మరో వ్యక్తి మైకంలో తూలుతూ వెళ్ళిపోయిన సీసీ టీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.