ఉరవకొండ: ఉపాధి పథకం అమలుపై ఏపీడీ విజయ్ కుమార్ సమీక్ష సమావేశం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం అమలుపై డ్వామా ఏపిడి విజయ్ కుమార్ మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా ప్రతి ఒక్క శ్రామికునికి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలని, లేబర్ బడ్జెట్ 2026 -27 ఆర్థిక సంవత్సరానికి పనుల గుర్తింపు, మొక్కలు నాటడం 100 రోజుల పని దినాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మురళి టిఏలు ఎఫ్ఏ లు తదితరులు పాల్గొన్నారు.