హత్నూర: ప్రధాని నరేంద్ర మోడీ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి : బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. ఆదివారం నర్సాపూర్ నియోజకవర్గ శివంపేటలో బిజెపి ఆధ్వర్యంలో సేవ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పెద్దపులి రవి, ఇన్చార్జి కవిత రెడ్డి బిజెపి నాయకులు పాల్గొన్నారు.