అనంతపురం అర్బన్: భార్యాభర్తల ఘర్షణల నేపథ్యంలో సమీప బంధువు బ్యాటుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం బందేపల్లికి చెందిన పీజీ రమేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఈనెల రెండవ తేదీన వారి సమీప బంధువు శ్రీనివాసులు బ్యాటు తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు . ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.