పాపం పేటలో పేదల ఇళ్ల జోలికి వస్తే ఎవరితోనైనా పోరాటం చేస్తాం పాపంపేటలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప హెచ్చరిక
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేటలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాపంపేట పరిరక్షణ సమితి నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ 1952లో కొంతమంది భూ యజమానులు అనేక ఎకరాల భూమిని అనేక మందికి విక్రయించడం జరిగిందని అయితే ఇప్పుడు కొత్తగా ఈ భూమి మాది అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని పేదల ఇళ్ల జోలికి వస్తే ఎవరినైనా బెదిరిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప హెచ్చరించారు. ఈ సమావేశంలో పాపంపేట గ్రామానికి చెందిన ప్రజలంతా పాల్గొన్నారు.