పటాన్చెరు: ఇంటి నిర్మాణం కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి : జిన్నారం మున్సిపల్ కమిషనర్ తిరుపతి
ఇంటి నిర్మాణం కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిన్నారం మున్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ... నూతనంగా ఏర్పడిన జిన్నారం మున్సిపాలిటీలో ఇంటి నిర్మాణం చేపట్టేవారు బెల్ట్ నౌ విధానంలో అనుమతులు తీసుకోవాలని, లేదా ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.