సంతనూతలపాడు: భారత్ ఎగుమత్తులపై అమెరికా సుంకాలను నిరసిస్తూ సంతనూతలపాడు లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
సంతనూతలపాడు : భారత్ ఎగుమత్తులపై అమెరికా శుంకాలను విధించడానికి నిరసిస్తూ సంతనూతలపాడులో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... భారతదేశ ఎగుమతులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ 50 శాతం శుంకాలను విధించడం వల్ల భారతదేశంలోని పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. అమెరికా భారీగా సుఖాలు విధించినప్పటికీ ప్రధాని మోడీ సరిగా స్పందించకపోవడం విచారకరమన్నారు. సుంకాల తగ్గింపుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.