బనగానపల్లె: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాళ్ల కొత్తూరుకు చెందిన వైసిపి నాయకులు పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రాళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గురువారం విషయం తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రికి చేరుకొని ప్రసాదును పరామర్శించారు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాటసాని వెంట అవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అంబటి రవి రెడ్డి తదితర వైసిపి నాయకులు ఉన్నారు