రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఈ నెల 17వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 (మంగళవారం) సాయంత్రం 6.00 గంటలకు నెల్లూరు నుండి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి ఒంగోలు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. 17వ తేదీ ఉదయం 10-00 గంటలకు ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ అంచనాలపై సమీక్షిస్తారు. అనంతరం గుంటూరుకు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.