ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని దొమ్మరి కాలనీలో : పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు దోమల స్వైర విహారం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని కోయిలకుంట్ల రోడ్డు దొమ్మరి కాలనీ సమీపంలో డ్రైనేజ్ కాలువలు నెలల తరబడి చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు స్వైర విహారం చేస్తూ దుర్గంధం వ్యాపిస్తున్నాయి, అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు, ఈ ప్రధాన డ్రైనేజ్ కాలువలో సిల్డ్ తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కాల్వకు మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు