అన్నమయ్య జిల్లాలో రౌడీలకు లేని స్థావరం: నూతన ఎస్పీ ధీరజ్ వార్నింగ్
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు. రౌడీలకు జిల్లాలో స్థావరం లేదని, అసాంఘిక శక్తులకు ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు.మీడియాతో మాట్లాడిన ఎస్పీ ధీరజ్ అన్నమయ్య జిల్లాలో ప్రజల శాంతి భద్రతకు నూరుశాతం రక్షణగా నిలుస్తానని హామీ ఇచ్చారు.చారిత్రాత్మకంగా ప్రత్యేకత కలిగిన ఈ జిల్లాలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు సమన్వయంతో ఉన్నారని, అందరి సహకారంతో మత్తు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా జిల్లాను ఒక మంచి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతానని స్ప