ముమ్మిడివరంలో శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు.
ముమ్మిడివరంలో జరిగిన శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర్ పంచాయతీ పరిధి మట్టాడిపాలెం గ్రామంలో శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.