ఉండ్రాజవరం మండలంలో ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమం, తాడిపర్రులో జెసిబి లతో తొలగించిన అధికారులు
రానున్న సార్వత్రిక ఎన్నికలకు శనివారం నుండి ఎలక్షన్ కోడ్ ప్రారంభమైన సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో అధికారులు కోడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు, గ్రామాల్లో పలుచోట్ల ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపు, గోడపత్రికల తొలగింపు వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామ కూడళ్ళలో ఏర్పాటుచేసిన వివిధ పార్టీలకు చెందిన భారీ ఫ్లెక్సీలను తొలగించేందుకు ఆయా అభ్యర్థులకు సమాచారం అందించినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. తాడిపర్రు కూడలిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు హోర్డింగులను అధికారులు దగ్గరుండి జెసిబి లతో తొలగించారు.