రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన బాపట్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథల మేరకు బాపట్ల నుంచి జమ్ములపాలెం వెళ్లే రోడ్డులో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు బాపట్ల మండలం కొత్తపాలెంకు చెందిన కోటేశ్వరరావుగా గుర్తించారు. క్షతగాత్రుడు కి ప్రస్తుతం బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.