తాడికొండ: డీఎస్సీ అభ్యర్థుల నియామక పత్రాల అందజేత సభ ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా
రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు మంగళవారం ఏర్పాట్లుఊ పరిశీలించారు.