కర్నూలు: ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది: కర్నూలు యుటిఎఫ్ టీచర్లు ఆందోళన
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని జీవో నెంబర్ 117 ను రద్దు చేస్తామంటూ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందని విద్యారంగాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామని చెప్పి విద్య రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కూటం ప్రభుత్వం నిర్ణయాలకు తీసుకుంటుందని కర్నూలులో యుటిఎఫ్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా పరిషత్ నుండి యుటిఎఫ్ టీచర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యా రంగ సమస్యలపై రణభేరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇప్పుడు అమలు చేయడం లేదని అన్నారు.