ఒంగోలు అర్బన్: శాంతి అనేది యుద్ధానికి యుద్ధానికి మధ్య కామా లాంటిది : సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్
Ongole Urban, Prakasam | Jul 12, 2026
యుద్ధాలన్నీ కులం మతం ప్రాంతం ఆధారంగా జరగవని ఏ యుద్ధం వెనక చూసిన వ్యాపార సంబంధాలే కనిపిస్తాయని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు ప్రధానంగా ముడి సరుకైన కనిజాల కోసం యుద్ధాలు జరుగుతాయన్నారు ఒంగోలులో 11వ రాష్ట్ర ప్రసూతి వైద్యుల వార్షిక సదస్సు హాజరైన ఆయన పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు శాంతి అనేది యుద్ధానికి యుద్ధానికి మధ్య ఒక కామా లాంటిది అన్నారు డబ్బుకు ఎంతవరకు విలువ ఇవ్వాలి అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక వ్యవహారాలనేవి మనం చూసే లెన్స్ ని బట్టి ఉంటాయన్నారు ప్రస్తుత పరిస్థితులలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉందన్నారు అప్పులు లేని మనిషి ఉండనట్టే తప్పులు లేని వారు కూడా ఉండరన్నా