నందికోట్కూరు: పట్టణంలోని సుబ్బారావు పేట కాలేజీ రోడ్ల, దోమల నివారణకు మున్సిపల్ కమిషనర్ చర్యలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి తెలిపారు, సుబ్బారావు పేట కాలేజీ రోడ్డు వంటి ప్రాంతాల్లో బుధవారం మందు పిచికారి చేయించారు, మున్సిపల్ కమిషనర్ స్వయంగా కాలనీలో పర్యటిస్తూ మున్సిపల్ సిబ్బంది చేత పనులు చేయిస్తూ స్థానిక సమస్యలను ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు, అలాగే ప్రజలు సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు, ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత పై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు