బనగానపల్లె: జాతీయస్థాయి కరాటే లో మంచి ప్రతిభ కనబరచాలి :బనగానపల్లె భారతీయ సంస్కృతి సంస్థ అధ్యక్షులు బీసీ రాజారెడ్డి
జాతీయ స్థాయి కరాటే పోటీలలో మంచి ప్రతిభకనబరచాలని భారతి సంస్కృతి సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి ఆకాక్షించారు. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో బనగానపల్లెకు చెందిన 12 మంది విద్యార్థులు వివిధ విభాగాలలో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని బీసీ రాజారెడ్డి అభినందించారు.