జహీరాబాద్: నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకు ఇందిరా శక్తి చీరల పంపిణి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని జహీరాబాద్ ,న్యాల్కల్, కోహిర్, జరా సంఘం, మొగుడంపల్లి మండలాల్లోని గ్రామాల్లో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళల్లో ఐక్యత పెంచడమే లక్ష్యంగా ఏకరూప చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు