సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో మంగళవారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సైన్స్ సంబంధిత అంశాలపై తమ ప్రజెంటేషన్లను సమర్పించారు. ఈ సెమినార్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు ఎంపిక చేస్తామని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు.