వేములవాడ: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం.. వాహనాల రాకపోకలకు అంతరాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై దర్శనమిచ్చింది.భారీ వర్షం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎంగిలిపూల బతుకమ్మ నేపథ్యంలో సాయంత్రం వర్షం కురవడంతో మహిళా మణులు నిరాశకు గురవుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్షం ఉన్నట్లు తెలిపారు. రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుతోంది.