కోడుమూరు: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. గూడూరు మండలంలోని ఆర్ కానాపురం గ్రామానికి చెందిన ఖాజా మిన్నల్లహుస్సేన్ అనే వ్యక్తికి రూ. 1,44,410 అలాగే కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణమోహన్ శెట్టికి రూ. 1,88,386 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా బాధితులు సీఎం చంద్రబాబు, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలకు ధన్యవాదాలు తెలిపారు.