వ్యవసాయ పొలం వివాదంలో రాడ్లు కర్రలు రాళ్లతో దాడి ముగ్గురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం. అరికల పంచాయతీ చిట్టమ్మ గారి పల్లి గ్రామంలో వ్యవసాయ పొలం భూ వివాదంలో సోమవారం దాయదుల మధ్య మాట పెరిగి ఇనుప రాడ్లు. రాళ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో కమ్మన్న కృష్ణమూర్తి. కృష్ణప్ప ,గాయపడ్డారు . గొడవల గాయపడ్డ కమ్మన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రి నుంచి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది