ఒంగోలు అర్బన్: డబ్బాలతో వచ్చే వారికి పెద్ద మొత్తంలో అడిగేవారికి పెట్రోల్ పోయవద్దు : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 27, 2026
డబ్బాలతో వచ్చే వారికి, పెద్ద మొత్తంలో అడిగేవారికి ఆయిల్ పోయవద్దని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఆయన టంగుటూరు మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పలు ఆయిల్ బంకులను తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి, వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ముందుగా బిపిసిఎల్ డిపోను సందర్శించారు. తమ వద్ద ఉన్న నిల్వలు, డిమాండ్ వివరాలను మేనేజర్ ఎల్. విజయ్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. జిల్లాలో తమకు 74 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ఎక్కడా కొరతలేదని, ఇండెంట్ రాగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు.