డోన్: బేతంచెర్ల మండలంలో వృద్ధులకు అందని పెన్షన్లు
Dhone, Nandyal | Aug 3, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని కనుమకింది కొట్టాల గ్రామంలో ఆగస్టు నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, కనుమకింది కొట్టాల గ్రామంలో 2 రోజులు గడిచినా లబ్ధిదారులకు పెన్షన్లు అందలేదు. గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు