ఖైరతాబాద్: అనర్హత పిటిషన్ల విషయంలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ నేతలు
అనర్హత పిటిషన్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు వెనక్కితగ్గడం లేదు. సోమవారం అసెంబ్లీ కార్యదర్శిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. అనర్హత పిటిషన్లపై రిప్లై ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఫొటోలు, వీడియోలతో సహా ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శి ఉపేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జగదీష్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింత ప్రభాకర్ పాల్గొన్నారు.