ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు రెండు సెట్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఐదు సెట్లు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుండి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.