మంచిర్యాల: సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ
సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలని ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సొంతింటి నిర్మాణ పథకం కోసం గతంలోనే కమిటి వేసిన ఇప్పటి వరకు యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలు చెల్లించాలని, డిస్మిస్ అయిన కార్మికులకు మరోసారి అవకాశం కల్పించాలని అలాగే కార్మికుల సమస్యలను, హక్కులను కాపాడటానికి ఏఐటియుసి యూనియన్ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు.