వెంకటగిరి విశ్వోదయ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తోందన్నారు. ఉద్యోగాలు రానివారు నిరాశ పడాల్సినవసరం లేదని, మరోసారి జరిగే జాబ్ మేళాలో ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు.