దోమకొండ: వరద బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ చేయూత : మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్
దోమకొండ : భారీ వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయిన బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల సమయంలో దోమకొండ మండలానికి చెందిన పలువురు బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కిట్లు అందజేశారు. దోమకొండ మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇండ్లు కూలిపోయిన బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా ఉండటం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు.