నందికోట్కూరు: పగిడ్యాల నందికొట్కూరు రహదారిలో రోడ్డు ప్రమాదం ఇద్దరికీ తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా పగిడ్యాల- నందికొట్కూరు వెళ్లే రహదారిలో జయరాముడు పొలం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో వికలాంగుడైన నాగన్న బైక్ పై వస్తుండగా అదుపు తప్పి కింద పడడంతో ఆయన కుమార్తె సురేఖ మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి, వీరు పగిడ్యాల నుండి వీపనగండ్ల గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది, స్పందించిన స్థానికులు వెంటనే హుటాహుటిన 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు