అశోక్ నగర్ గ్రామంలో యూరియా కోసం తెల్లవారుజాము నుండే క్యూలైన్లో ఉన్న రైతులు
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా వస్తుందన్న సమాచారంతోనే తెల్లవారుజామునుండే క్యూ లైన్ లో ఉన్న రైతులు. పెద్ద ఎత్తున పురుషులు మహిళలు అనే తేడా లేకుండా క్యూలైన్లో చెప్పులను ఉంచు మరి గంటలకు కొద్ది వేచి ఉన్న పరిస్థితి యూరియా కోసం నెలకొంది. కొందరు మహిళా రైతులు మాత్రం చిన్న పిల్లలను సంకన వేసుకొని వచ్చి అక్కడే పడిగాపులు కాసిన పరిస్థితి అయితే నెలకొంది. సుమారు 500 మంది రైతులు రైతు వేదిక వద్దకు చేరుకొని యూరియా కోసం పడిగాపులు కాచారు ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.