సంగారెడ్డి: మధుర దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాటు, తహసిల్దార్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులు
సంగారెడ్డి జిల్లా మధుర దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు సభాపతి శర్మ పేర్కొన్నారు. అత్ముర జూపేట్ ప్రధాన రోడ్డు నుంచి దత్తాత్రేయ స్వామి ఆలయం వరకు ఏర్పడిన గుంతలను గురువారం తాసిల్దార్ ఫరీన్ షేక్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడం పట్ల భక్తులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వీరస్వామి గౌడ్ కిష్టయ్య, నవీన్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.