ప్రకాశం జిల్లా కొండపి- పొదిలి రోడ్డులో సైడ్ డ్రైనేజీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో వర్షంవస్తే నీరు ఎటుపోయే మార్గంలేక రోడ్డులోనే నిల్వ ఉండేది. ఇది గమనించిన మంత్రి స్వామి రోడ్డు రెండువైపులా సైడ్ డ్రైనేజీలు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీంతో గత 4 రోజులుగా పనులు ఊపందుకున్నాయి. ఈ డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే రహదారుల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు.