నంద్యాల అర్బన్: నంద్యాలలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఓ అధికారిని సెల్ఫోన్లో పేకాట ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
Nandyal Urban, Nandyal | Apr 15, 2026
నంద్యాల పట్టణంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం నందు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని జిల్లా మంత్రి ఫరూక్,కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి తన సెల్ఫోన్లో పేకాట ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక అధికారిక కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారి అయ్యుండి ఇలా చేయడం విమర్శలకు తావిస్తుంది. అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ప్రజాసంఘాల నాయకులు గురువారం మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు