బనగానపల్లె: ఫేస్ యాప్ తో ఉపాధి కార్మికులకు ఇబ్బందులు : బనగానపల్లె సిపిఐ మండల కార్యదర్శి శివయ్య
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం మీరాపురం పంచాయతీలో ఉపాధి కార్మికులు ఫేస్ యాప్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ మండల కార్యదర్శి శివయ్య తెలిపారు. నెట్వర్క్ సమస్యల వల్ల హాజరు నమోదు ఆలస్యమవుతూ గంటల సమయం వృథా అవుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానాన్ని పునరుద్ధరించాలని, పనిముట్లు, నీరు వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు.