ఒంగోలు అర్బన్: నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేసాం: ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నీట్ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు కలెక్టర్ రాజాబాబు ఆదివారం తెలిపారు. 1800 మందికి పైగా అభ్యర్థులు మన జిల్లాలో పరీక్షలు రాస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు మీడియాకు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు.