అమీర్‌పేటలోని HMDA కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కొత్తూరు- షాబాద్ మండలాల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ భూ నిర్వాసితులైన 50 మంది రైతులు ధర్నా చేపట్టారు. భూ పరిహారం ఇవ్వాలంటూ హెచ్ఎండీఏ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. కొత్వాల్ గూడ-చిట్యాల రోడ్డు విస్తరణకు భూములు కోల్పోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.