గుంతకల్లు: గుత్తిలో ఘనంగా సయ్యద్ షా వలి బాష ఖాద్రీ ఉరుసు ఉత్సవాలు, పట్టణంలో షంషీర్ ఊరేగింపు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోటపై వెలసిన హజరత్ సయ్యద్ షా వలి బాష ఖాద్రీ రహంతుల్లా అలైహి ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జియారత్ వేడుకల్లో భాగంగా షంషీర్ ను గుర్రంపై ఉంచి ఊరేగించారు. స్వామి వారి గుర్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలోని పుర విధులలో ఊరేగించారు. భక్తులు చక్కెర చదివింపులు ఇచ్చారు. షంషీర్ ను కొండపై ఉన్న దర్గాలోకి తీసుకెళ్లి స్వామికి సమర్పించారు. మూడు రోజుల పాటు జరిగిన ఉరుసు ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయని నిర్వాహకులు తెలిపారు.