చివ్వెంల: ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయాలని దాడి: చివ్వెంల ఎస్సై మహేష్
కోదాడ కిట్స్ కాలేజ్ ఛైర్మన్ సత్యనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. చివ్వెంల ఎస్సై మహేష్ కథనం ప్రకారం.. సత్యనారాయణ హైదరాబాద్ నుంచి కోదాడ బయలుదేరారు. గుంపుల తిరుమలగిరి సమీపంలో సత్యనారాయణ కారును దుండగులు అడ్డగించారు. ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయాలంటూ బెదిరించినట్లు చెప్పారు. మల్లికార్జున్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారని చెప్పారు.